Telugu Global
Andhra Pradesh

ధర్మాన, బొత్స.. కనీసం కానిస్టేబుల్ ని ట్రాన్స్ ఫర్ చేయించలేరా..?

'టచ్'లో ఉన్నవారి పేర్లు చెప్పండి అంటూ పేర్ని నాని వంటి వారు డిమాండ్ చేయడం వారి పిచ్చితనం అని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్‌ లో ఉండటమే కాకుండా, తిరిగి తమకే బంపర్‌ ఆఫర్లు ఇస్తున్నారని చెప్పారు అచ్చెన్నాయుడు.

ధర్మాన, బొత్స.. కనీసం కానిస్టేబుల్ ని ట్రాన్స్ ఫర్ చేయించలేరా..?
X

జగన్ మంత్రి వర్గంలో సీనియర్లు అయిన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మాట అసలు చెల్లుబాటు కావడంలేదని ఎద్దేవా చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వారిద్దరూ గతంలో మంత్రులుగా హవా చూపించేవారని, వారి శాఖలు స్వయంప్రతిపత్తితో ఉండేవని, కానీ జగన్ హయాంలో ఆ పరిస్థితి లేదన్నారు. కనీసం ఓ కానిస్టేబుల్ ని కూడా బదిలీ చేయించుకోలేని నిస్సహాయ స్థితిలో ధర్మాన, బొత్స ఉన్నారన్నారు.

వైసీపీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రజా వ్యతిరేకతతో.. మంత్రులు ధర్మాన, బొత్స ఉద్దేశ పూర్వకంగానే బ్యాలెన్స్‌ తప్పుతున్నారని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు. మంత్రి ధర్మాన, మహిళల ముందు మీసాలు మెలేస్తున్నారని, తొడ కొడుతున్నారని, మగాళ్లను పోరంబోకులు అంటూ విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు అచ్చెన్న.

'టచ్' లోనే ఉన్నారు..

వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్‌ లో ఉండటమే కాకుండా, తిరిగి తమకే బంపర్‌ ఆఫర్లు ఇస్తున్నారని చెప్పారు అచ్చెన్నాయుడు. ఒక్కరికి సీటిస్తామని హామీ ఇస్తే.. నలుగురు ఎమ్మెల్యేలు వస్తామంటూ తనకు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. మేం టీడీపీలోకి వెళ్లడంలేదు, వైసీపీలోనే జీవితాంతం ఉంటామంటూ గంభీరంగా చెప్పే వాళ్లే బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన జాబితాలో ముందున్నారని స్పష్టం చేశారు. వైసీపీలో ఉంటే వారికి భవిష్యత్తు ఉండదని తేలిపోయిందన్నారు. 'టచ్'లో ఉన్నవారి పేర్లు చెప్పండి అంటూ పేర్ని నాని వంటి వారు డిమాండ్ చేయడం వారి పిచ్చితనం అని అన్నారు.

First Published:  6 April 2023 4:12 PM GMT
Next Story