Telugu Global
Andhra Pradesh

ఏపీలో త‌ల్లిదండ్రుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ శుభ‌వార్త‌

ఐదేళ్ల లోపు పిల్ల‌ల‌కు ఆధార్ కార్డు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కొత్త నిర్ణ‌యం తీసుకుంది. దీని ప్ర‌కారం.. ఇక‌పై వారికి తాత్కాలిక ఆధార్ కార్డు జారీ చేస్తారు. ఆ కార్డు నీలి రంగులో ఉంటుంది.

ఏపీలో త‌ల్లిదండ్రుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ శుభ‌వార్త‌
X

ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ రానుంది. ఏపీ వైద్యశాఖ ఈ ప్రక్రియను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కోసం ఏరియా, జిల్లా, బోధ‌న ఆస్ప‌త్రుల‌కు ట్యాబులు, ఫింగర్ ప్రింట్ స్కానర్ లను సమకూర్చనుంది. ఈ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు యుఐడిఏఐఓ పరీక్షను నిర్వహించ‌నున్న‌ట్టు ఏపీ వైద్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. అందులో అర్హత సాధించిన వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఈ ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ చేప‌డ‌తారు. పుట్టిన‌తేదీ రిజిస్ట్రేష‌న్ త‌ర‌హాలోనే ఈ ప్ర‌క్రియ ఉంటుంది.

నీలి రంగు ఆధార్‌...

ఐదేళ్ల లోపు పిల్ల‌ల‌కు ఆధార్ కార్డు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కొత్త నిర్ణ‌యం తీసుకుంది. దీని ప్ర‌కారం.. ఇక‌పై వారికి తాత్కాలిక ఆధార్ కార్డు జారీ చేస్తారు. ఆ కార్డు నీలి రంగులో ఉంటుంది. సాధారణంగా పిల్లలు పెరిగిన తర్వాత.. వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఏరియా అధికారుల నుంచి ధ్రువపత్రం, చిరునామా పలు ఆధారిత వివరాల ప్రకారం ఆధార్ కార్డును జారీ చేస్తారు. అయితే.. ఈ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది. దీంతో తల్లిదండ్రులు పథకాలకు అర్హత, పలు సందర్భాల్లో ఇబ్బందులు పడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్డు జారీకి శిశువుల బయోమెట్రిక్ డేటాతో పని లేదు. పిల్లల ఫొటో, తల్లిదండ్రుల పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ తదితర వివరాల ఆధారంగా శిశువుకు అప్పటికప్పుడు తాత్కాలిక ఆధార్ కార్డును జారీ చేస్తారు.

First Published:  30 Aug 2022 2:59 AM GMT
Next Story