Telugu Global
Andhra Pradesh

ఆవిడ త‌ల్లేనా..? - మాతృత్వానికే మ‌చ్చ తెచ్చేలా దారుణం

తొలుత 17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి చనిపోయాడు.

ఆవిడ త‌ల్లేనా..? - మాతృత్వానికే మ‌చ్చ తెచ్చేలా దారుణం
X

వ‌య‌సొచ్చిన కుమార్తెల‌ను రెండో భ‌ర్తప‌రం చేసి మాతృత్వానికే మ‌చ్చ తెచ్చేలా దారుణంగా వ్య‌వ‌హ‌రించింది ఓ క‌న్న‌త‌ల్లి. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుమార్తెల ఫిర్యాదుతో దిశ పోలీసులు త‌ల్లిని, ఆమె రెండో భ‌ర్త‌ను గురువారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి దిశ సీఐ ఇంద్రకుమార్ తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

ఆమెకు భ‌ర్త‌, ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు ఉన్నారు. పిల్ల‌లు పుట్టిన అనంత‌రం కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ చేయించుకుంది. 2007లో ఆమె భ‌ర్త అనారోగ్యంతో మ‌ర‌ణించాడు. ఆ త‌ర్వాత ఆమె త‌న మేన‌త్త కొడుకును రెండో పెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు కావాలని, లేదంటే మరో పెళ్లి చేసుకుంటానని అతడు బెదిరించేవాడు. కొన్నేళ్లకు.. ఆడపిల్లలిద్దరూ యుక్తవయసుకు వచ్చారు. వేరే పెళ్లి వద్దని, తన కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని తన రెండో భర్తను ఆమె ఒప్పించింది.

తొలుత 17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి చనిపోయాడు. ఆ మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఇటీవల భర్తతో విభేదాలతో.. కుమార్తెలను గ్రామంలోనే వదిలేసి విశాఖలోని పుట్టింటికి వెళ్లిపోయింది. చిన్న కుమార్తె తనకు పరిచయమైన యువకుడికి ఇదంతా చెప్పడంతో.. అతడు పిల్లల మేనమామకు తెలిపాడు. బంధువులంతా ఏలూరు వచ్చి బాధితులతో దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. పోలీసులు నిందితులపై పోక్సో కేసు నమోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  14 July 2023 4:14 AM GMT
Next Story