Telugu Global
Andhra Pradesh

మిరాకిల్ జరిగింది.. బాలకృష్ణ రాగానే రికవరీ అయ్యాడు- గోరంట్ల బుచ్చయ్య

తారకరత్నను తీసుకొచ్చిన వెంటనే పరిశీలించిన వైద్యులు దాదాపు అంతా అయిపోయిందని చెప్పారని.. అంతలోనే బాలకృష్ణ వచ్చారని గోరంట్ల వివరించారు. అదో మిరాకిల్‌ అన్నట్టుగా బాలకృష్ణ రాగానే తారకరత్న ఆరోగ్యం మెరుగుపడిందన్నారు.

మిరాకిల్ జరిగింది.. బాలకృష్ణ రాగానే రికవరీ అయ్యాడు- గోరంట్ల బుచ్చయ్య
X

గుండెపోటుకు గురైన తారకరత్న ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. గుండె ఎడమ వైపు నాళం 90 శాతం బ్లాక్ అవడంతో తీవ్ర గుండెపోటు వచ్చిందని బాలకృష్ణ వివరించారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిందని తెలియగానే బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకున్నారు. 45 నిమిషాల పాటు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత తారకరత్న ఆరోగ్యం కాస్త మెరుగుపడింది.

మరింత మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తీసుకెళ్తే మంచిదని వైద్యులు సూచించారని బాలకృష్ణ చెప్పారు. మిగిలిన అన్ని రిపోర్టులు బాగున్నాయన్నారు. కుప్పంలోని స్థానిక వైద్యులు అద్బుతంగా స్పందించారని బాలకృష్ణ చెప్పారు. బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. వైద్యులు తీవ్రంగా శ్రమించిన తర్వాత తారకరత్న కొద్దిగా కోలుకున్నారని.. ఇంకా స్టంట్‌ ఏమీ వేయలేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

తారకరత్నను తీసుకొచ్చిన వెంటనే పరిశీలించిన వైద్యులు దాదాపు అంతా అయిపోయిందని చెప్పారని.. అంతలోనే బాలకృష్ణ వచ్చారని గోరంట్ల వివరించారు. అదో మిరాకిల్‌ అన్నట్టుగా బాలకృష్ణ రాగానే తారకరత్న ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. బాలకృష్ణ వచ్చారో లేక అఖండ వచ్చారో అన్నట్టుగా పరిస్థితి మారిందన్నారు. బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారన్నారు. కుడి, ఎడమ గుండె నాళాలు బాగా పూడిపోవడంతోనే గుండెపోటు వచ్చిందన్నారు.

First Published:  27 Jan 2023 11:06 AM GMT
Next Story