Telugu Global
Andhra Pradesh

తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం

టీటీడీ నెయ్యికల్తీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) దర్యాప్తు నిలిపివేసింది. లడ్డూ వివాదంపై సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో సిట్‌ దర్యాప్తు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం
X

తిరుమల లడ్డూ అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో ఎల్లుండి వరుకు సిట్ దర్యాప్తు నిలిపివేసినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. 3న న్యాయస్థానం ఆదేశాల తర్వాత తదుపరి ఎంక్వరీ కొనసాగిస్తుమన్నారు. టీటీడీ నెయ్యి నాణ్యత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా లేక వేరే సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్న విషయంలో సుప్రీంకోర్టు సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయాన్ని కోరింది.

దీంతో లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే దాకా సిట్‌ తన దర్యాప్తును నిలిపివేసింది. తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యికల్తీ అయిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని శ్రీవారి మాజీ చైర్మన్‌ వైవీసుబ్బారెడ్డితో పాటు సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపిన విషయం తెలిసిందే.

First Published:  1 Oct 2024 9:06 AM GMT
Next Story