Telugu Global
Andhra Pradesh

రామోజీరావుపై కేసు నమోదు

ఈ కేసులో A1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు,A2గా చెరుకూరి శైలజ,A3గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లున్నారు.

రామోజీరావుపై కేసు నమోదు
X

మార్గదర్శి ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు

మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజ, పలు బ్రాంచ్ మేనేజర్లపై కూడా సీఐడీ కేసు పెట్టింది. 1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం ఈ కేసు నమోదు చేసినట్టు సీఐడీ అధికారులు తెలిపారు.

ఈ కేసులో A1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు,A2గా చెరుకూరి శైలజ,A3గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లున్నారు.

విజయవాడ, గుంటూరు, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు ఇచ్చిన పిర్యాదు మేరకు సీఐడీ ఈ కేసు నమోదు చేసింది.

చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్మును పక్కదారి మళ్ళించి, దుర్వినియోగం చేశారని వీరిపై ఆరోపణ. చిట్ ఫండ్ ఫండ్ నిధులను, మ్యూచువల్ ఫండ్ ను స్పెక్యులేటీవ్ మార్కెట్ కు మళ్ళించారని సీఐడీ అధికారులు గుర్తించారు. అంతే కాక మార్గదర్శి చిట్ ఫండ్ లో అనేక అక్రమాలు జరిగాయని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆడిటింగ్ లో గుర్తించింది.

First Published:  12 March 2023 2:13 AM GMT
Next Story