ఫ్రెంచ్ ఫేషియల్ గురించి తెలుసా?

బ్యూటీ ట్రెండ్స్‌లో రకరకాల కొత్త పద్ధతులు పుట్టుకొస్తుంటాయి. అలాంటిదే ఈ ఫ్రెంచ్ ఫేషియల్ కూడా. ఇప్పుడీ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. అసలేంటీ ‘ఫ్రెంచ్ ఫేషియల్’? దీని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Update: 2024-05-24 02:00 GMT

బ్యూటీ ట్రెండ్స్‌లో రకరకాల కొత్త పద్ధతులు పుట్టుకొస్తుంటాయి. అలాంటిదే ఈ ఫ్రెంచ్ ఫేషియల్ కూడా. ఇప్పుడీ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. అసలేంటీ ‘ఫ్రెంచ్ ఫేషియల్’? దీని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రెంచ్ ఫేషియల్ అనే బ్యూటీ ట్రెండ్.. ఎప్పటినుంచో పాపులర్. తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ ఇచ్చే ఫేషియల్స్‌లో ఇదొకటి. ఇది ముఖం మీది చర్మాన్ని ఇన్‌స్టంట్‌గా క్లీన్ చేసి ముఖం మెరుపుని సంతరించుకునేలా చేస్తుంది.

ఫ్రెంచ్ ఫేషియల్ రొటీన్‌ను స్టేజీల వారీగా చేస్తారు. వాటిలో మొదటిది క్లెన్సింగ్. క్లెన్సింగ్‌లో భాగంగా ముందు ముఖంపై ఎలాంటి దుమ్ము, ధూళి లేకుండా క్లీన్ చేస్తారు. మేకప్‌ లాంటివి ఉంటే పూర్తిగా తీసేస్తారు. చర్మాన్ని సహజ తీరులోకి తెచ్చిన తర్వాత రెండో స్టేజ్ అయిన టోనింగ్ చేస్తారు.

టోనింగ్ లో భాగంగా మాయిశ్చర్ అప్లై చేసి మైల్డ్ టోనర్‌తో ముఖాన్ని నీట్‌గా టోనింగ్ చేస్తారు. దీంతో ముఖం మీది చర్మం తేమగా మారుతుంది. ఇక తర్వాత స్టేజీలో ముఖంమీది టాక్సిన్స్‌ను తొలగించడం కోసం థర్మల్ ఎనర్జీ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది స్టీమింగ్ లాంటి ఓ ప్రత్యేకమైన ప్రాసెస్. ఆవిరి సాయంతో చర్మం పైపొరల్లో ఉన్న టాక్సిన్స్ బయటకువెళ్లేలా చేస్తారు.

ఫ్రెంచ్ ఫేషియల్ తర్వాతి స్టేజ్ పేరు ‘డైనమిక్ అయనైజేషన్’. ఇది ఫేషియల్‌లో ముఖ్యమైన దశ. అయనైజేషన్ ప్రాసెస్ అనే ఓ ప్రత్యేక పద్ధతి ద్వారా ముఖం మీది చర్మంలోని బ్లాక్ హెడ్స్‌ను తొలగిస్తారు. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. దీని తర్వాత ఫేస్ మసాజ్‌చేసి చర్మంలో రక్త ప్రసరణ పెరిగేలా చేస్తారు. దీంతో ఫ్రెంచ్ ఫేషియల్ రొటీన్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఐ ల్యాషెస్, అండర్ ఐ, ఐబ్రోస్‌కు టచప్ ఇచ్చి ఫేషియల్ పూర్తి చేస్తారు. ఈ ఫేషియల్ రొటీన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్. తక్కువ టైంలో బెస్ట్ రిజల్ట్స్ కోరుకునే వాళ్లకు ఇది బెస్ట్ టెక్నిక్‌గా చెప్పుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News