ఈ ఏడాది లాంగ్ వీకెండ్స్ ఇవే..

Long Weekends in 2023, List of holidays: ఒకట్రెండు సెలవులు సర్దుబాటు చేసుకోగలిగితే మూడు, నాలుగు రోజుల ట్రిప్‌కు రెడీ అయిపోవచ్చు.

Advertisement
Update: 2023-01-03 13:00 GMT

ఈ ఏడాది లాంగ్ వీకెండ్స్ ఇవే..

కొత్త ఏడాదిలో పండుగలన్నీ శనివారానికి ముందో, ఆదివారం తర్వాతో వస్తే ఎంచక్కా సెలవల్లో ఎక్కడికైనా వెళ్లి రావొచ్చని సంబురపడిపోతారు చాలామంది. కానీ, బ్యాడ్‌లక్ ఏంటంటే 2023లో చాలా పండుగలు ఆదివారం నాడే వచ్చాయి. కానీ, ప్రయాణాలకు వీలుగా కొన్ని లాంగ్‌వీకెండ్‌లు కూడా లేకపోలేదు. ఒకట్రెండు సెలవులు సర్దుబాటు చేసుకోగలిగితే మూడు, నాలుగు రోజుల ట్రిప్‌కు రెడీ అయిపోవచ్చు. ఈ ఏడాది లాంగ్ వీకెండ్ ఆప్షన్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే..

ఈ ఏడాది జనవరి 26 గురువారం వచ్చింది. శుక్రవారం సెలవు పెట్టుకోగలిగితే శని, ఆదివారాలు అదనంగా కలిసొస్తాయి. నాలుగు రోజుల ట్రిప్‌కు ప్లాన్ చేయొచ్చు.

2023 మహాశివరాత్రి ఫిబ్రవరి 17 శుక్రవారం రోజున వచ్చింది. శని, ఆదివారాలు జతచేస్తే.. మూడు రోజుల్లో చిన్న టూర్ ప్లాన్ చేయొచ్చు.

ఏప్రిల్‌ 7 గుడ్‌ఫ్రైడేకు తోడుగా శని, ఆది వారాలు కలుపుకుంటే మరో చిన్న టూర్ ప్లాన్ రెడీ.

జూన్‌ 29 గురువారం బక్రీద్‌ పండుగ వచ్చింది. ఒకరోజు సెలవు పెట్టుకోగలిగితే.. మరో రెండు రోజులు కలిసొస్తాయి. వర్షాకాలానికి ముందు మంచి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.

ఆగస్టు 15 మంగళ వారం వచ్చింది. ఆగస్టు 12 సెకండ్ సాటర్ డే. ఆదివారం, సోమవారం సెలవు తీసుకుంటే.. నాలుగు రోజుల విహారానికి ప్లాన్ చేసుకోవచ్చు.

సెప్టెంబర్‌ 7న గురువారం జన్మాష్టమి వచ్చింది. శుక్రవారం సెలవు తీసుకోగలిగితే రెండు రోజులు కలిసొస్తాయి. అలా నాలుగు రోజులు టూర్ ప్లాన్ చేయొచ్చు.

అక్టోబర్‌లో 21 శనివారం నుంచి 24 వరకూ దసరా సెలవులు వస్తాయి. అటుఇటుగా నాలుగైదు రోజుల ట్రిప్ ప్లాన్ చేయొచ్చు.

నవంబర్‌ 27 గురునానక్‌ జయంతి సోమవారం వచ్చింది. శని, ఆదివారాలతో మొత్తంగా మూడురోజుల ట్రిప్‌ వేసుకోవచ్చు.

డిసెంబర్‌ 25 క్రిస్మస్‌ సోమవారం వచ్చింది. మంగళవారం కూడా సెలవి తీసుకోగలిగితే ఇయర్ ఎండ్‌లో చిన్న ట్రిప్ ప్లాన్ చేయొచ్చు.

Tags:    
Advertisement

Similar News