నాగోల్‌లో మద్యం మత్తులో రచ్చ చేసిన యువ జంట అరెస్ట్

నాగోల్‌లోని ఫతుల్లాగూడ ప్రాంతంలో ఓ యువకుడు, మహిళ రోడ్డు మధ్యలో కారు నిలిపి బీర్ తాగుతున్నారు. ఆ సమయంలో వాకింగ్ కోసం అటుగా వచ్చిన సీనియర్ సిటిజన్లు నడిరోడ్డుపై మద్యం సేవించడం తగదని సూచించారు.

Advertisement
Update: 2024-05-25 12:35 GMT

హైదరాబాద్‌లో ఇటీవల ఓ యువ జంట నడిరోడ్డుపై బీర్ తాగి దారిన వెళ్తున్న వారిని దుర్భాషలాడుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తెల్లవారకముందే మద్యం తాగడమే కాకుండా వాకర్స్ పట్ల అనుచితంగా ప్రవర్తించి కారును స్పీడ్‌గా డ్రైవ్ చేసి వారిని భయభ్రాంతులకు గురిచేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో రోడ్డుపై రచ్చ చేసిన సదరు యువ జంటను నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు.

శుక్రవారం ఉదయం నాగోల్‌లోని ఫతుల్లాగూడ ప్రాంతంలో ఓ యువకుడు, మహిళ రోడ్డు మధ్యలో కారు నిలిపి బీర్ తాగుతున్నారు. ఆ సమయంలో వాకింగ్ కోసం అటుగా వచ్చిన సీనియర్ సిటిజన్లు నడిరోడ్డుపై మద్యం సేవించడం తగదని సూచించారు. అలా సూచించినందుకు మహిళ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాకర్స్ ను దుర్భాషలాడటం మొదలుపెట్టింది. ఆమె వెంట ఉన్న యువకుడు కూడా మహిళకు మద్దతుగా మాట్లాడాడు.

వాకర్స్ ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారొచ్చే లోగా యువ జంట అక్కడి నుంచి ప‌రారైంది. అయితే అప్పటికే ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యువజంట తీరుపై విమర్శలు రావడంతో నాగోల్ పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా వారిని గుర్తించి అరెస్టు చేశారు.

Tags:    
Advertisement

Similar News