కాంగ్రెస్‌కు వైసీపీ ఎంపీ మద్దతు

బీసీ సంఘం నేతగానే ఆయన ఈ పిలుపునిచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో మిగతా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. మల్లన్న ఒక్కరే బీసీ.

Advertisement
Update: 2024-05-26 04:01 GMT

తెలంగాణలో జరుగుతున్న వరంగల్‌-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య. ప్రస్తుతం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడుగా ఉన్న ఆర్.కృష్ణయ్య.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. సమస్యలు, అవినీతిపై ప్రశ్నించే అభ్యర్థిని కులాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా గెలిపించేందుకు మేధావులు, విద్యావంతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌, వైసీపీ అంటే ఉప్పు, నిప్పుగా ఉన్న పరిస్థితుల్లో ఆర్. కృష్ణయ్య ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా ఉంది. ఆర్.కృష్ణయ్య నిర్ణయంపై వైసీపీ స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. అయితే బీసీ సంఘం నేతగానే ఆయన ఈ పిలుపునిచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో మిగతా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. మల్లన్న ఒక్కరే బీసీ. ఈ నేపథ్యంలోనే ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆదివారంతో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా.. ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్‌ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News