జేపీ నడ్డా చెప్పులు మోయడానికి అంత పోటీ ఉందా?

మొన్న బీజెపీ అగ్రనేత తెలంగాణ వచ్చినప్పుడు ఆయన చెప్పులు మోసిన బండిసంజయ్ వ్యవహారం నేపథ్యంలో ఇవ్వాళ్ళ జేపీ నడ్డా చెప్పులు ఎవరు మోస్తారంటూ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. అందుకు తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.

Advertisement
Update: 2022-08-27 06:49 GMT

బీజేపీ అధ్యక్షుడు జేపీ. నడ్డా శనివారం హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆ పార్టీ నేతలనుద్దేశించి మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. నడ్డా చెప్పులు ఇవాళ ఏ 'గులాం' మోస్తారని, కచ్చితంగా తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్నానని ట్వీట్ చేశారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించిన ఉదంతంపై స్పందించిన కేటీఆర్..తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని విమర్శించారు. ఇప్పుడు నడ్డా నగరానికి వస్తే ఎవరు మోస్తారన్నారు. హరితహారం విస్తరణలో దేశంలోని అన్నినగరాల్లోకెల్లా హైదరాబాద్ సమున్నతంగా నిలబడిందని, ఇందుకు సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో నగరంలో 'గ్రీన్ కవర్' 147 శాతం పెరిగిందని.. ఇది కేసీఆర్ మానస పుత్రిక.. హరితహారం కారణంగానేనని అన్నారు. సిటీలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..''సలాం ! హైదరాబాద్.. నీ సంయమనం భేష్' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ నిర్వాకాలను ఎండగడుతూ ఆయన.. ఎమ్మెల్యేల కొనుగోళ్లు జీఎస్టీకి అర్హం కాదా అని కూడా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News