రేషన్‌ కార్డు లేకుంటే స్కీమ్స్ రావా..? సీఎం రేవంత్ ఏమన్నారంటే?

రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నప్పటికీ.. లక్షలాది మంది కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అందుతాయన్న ప్రచారంతో లక్షలాది మంది గందరగోళంలో ఉన్నారు.

Advertisement
Update: 2023-12-27 14:15 GMT

తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రజా పాలన దరఖాస్తు పేరుతో ఇప్పటికే అప్లికేషన్‌ ఫామ్‌ను సైతం సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. మొత్తం ఐదు గ్యారెంటీలకు ఒకే అప్లికేషన్‌ ఫామ్‌ను రూపొందించారు. గురువారం నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు వచ్చే నెల 6 వరకు గడువు విధించారు.

రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నప్పటికీ.. లక్షలాది మంది కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అందుతాయన్న ప్రచారంతో లక్షలాది మంది గందరగోళంలో ఉన్నారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్‌ కార్డు ఉంటేనే పథకాలు అమలవుతాయన్నారు. తమ ప్రభుత్వం రేషన్‌ కార్డులు మంజూరు చేస్తుందని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని చెప్పారు రేవంత్ రెడ్డి.

రేషన్‌ కార్డు లేకున్నా ప్రస్తుతం పథకాల కోసం దరఖాస్తు చేసుకొవచ్చని చెప్పారు. పథకాల కోసం దరఖాస్తు చేసుకునే టైమ్‌లో రేషన్‌ కార్డు వివరాలు నమోదు చేసే కాలంలో కార్డు లేదని రాయాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News