మోడీ సభకు ఆ ఇద్దరు డుమ్మా.. పార్టీ మారడం ఖాయమా!

ఇటీవల CWC సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్‌, MIMపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు రాములమ్మ. అంతే కాదు.. తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీయే అంటూ ట్వీట్ కూడా చేశారు.

Advertisement
Update: 2023-10-01 17:10 GMT

ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు సభకు పలువురు సీనియర్లు డుమ్మా కొట్టారు. ఈ ఏడాది చివర్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పాలమూరు నుంచి బీజేపీ క్యాంపెయిన్ స్టార్ట్‌ చేసింది. అయితే బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ఈ సభకు సీనియర్లు విజయశాంతి, రాజగోపాల్‌ రెడ్డి హాజరుకాలేదు. ఈ విషయం కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలతో ఈ ఇద్దరు నేతలు కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్త నేతల సమావేశాలకు సైతం ఈ ఇద్దరు నేతలు హాజరయ్యారు. పలు అంశాల్లో పార్టీ తీరును బహిరంగంగానే తప్పుపట్టారు. దీంతో ఇద్దరు పార్టీ మారుతారనే ప్రచారం కొంతకాలంగా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మోడీ సభకు కూడా హాజరుకాకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది.

ఇటీవల CWC సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్‌, MIMపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు రాములమ్మ. అంతే కాదు.. తెలంగాణను ఇచ్చింది సోనియా గాంధీయే అంటూ ట్వీట్ కూడా చేశారు. ఇక రాజగోపాల్ రెడ్డి సైతం శనివారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను పార్టీ మారుతాననే ప్రచారం ఆరు నెలలుగా జరుగుతోందని.. అయితే దానిపై త్వరలోనే క్లారిటీ ఇస్తానంటూ సస్పెన్స్ కొనసాగించారు.

Tags:    
Advertisement

Similar News