ఈటల మాట నెగ్గింది.. బీజేపీలో కొట్లాట మొదలైంది

మూడు రోజుల్లో టికెట్ మార్చకపోతే కచ్చితంగా రాజీనామాలు చేస్తామంటున్నారు వేములవాడ నియోజకవర్గ నేతలు. పార్టీలో పదవులకు రాజీనామా చేసినా.. బండి సంజయ్ నేతృత్వంలో పనిచేస్తామంటున్నారు.

Advertisement
Update: 2023-11-07 11:24 GMT

జాబితాల విడుదల తర్వాత బీఆర్ఎస్ లో అలకల సీన్లు ఉన్నా, అక్కడక్కడా మాత్రమే కనిపించాయి. కాంగ్రెస్ లో మాత్రం ఫైటింగ్ సీన్లు ఓ రేంజ్ లో జరిగాయి, జరుగుతున్నాయి కూడా. బీజేపీలో టికెట్ కోసం గొడవలు జరిగిన దాఖలాలు పెద్దగా లేవు. కానీ తాజా జాబితా తర్వాత బీజేపీలో కూడా సీన్ రివర్స్ అయింది. వేములవాడ బీజేపీలో ముసలం పుట్టింది. ఈ గొడవకి కారణం ఈటల కావడం విశేషం.

వేములవాడ బీజేపీ టికెట్‌.. ఈటల వర్గమైన తుల ఉమకు కేటాయించింది అధిష్టానం. దీంతో ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులకు కోపం వచ్చింది. క్షేత్రస్థాయిలో పనిచేసినవారిని గుర్తించలేదంటూ పలువురు నేతలు ఫైర్‌ అయ్యారు. మూకుమ్మడిగా మండల అధ్యక్షులు రాజీనామా చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. చెన్నమనేని వికాస్ వర్గం అధిష్టానంపై తిరుగుబాటు ప్రకటించింది. బీజేపీలో కూడా ఇలా జరిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు నేతలు.

మూడు రోజుల డెడ్ లైన్..

మూడు రోజుల్లో టికెట్ మార్చకపోతే కచ్చితంగా రాజీనామాలు చేస్తామంటున్నారు వేములవాడ నియోజకవర్గ నేతలు. అయితే ఇక్కడ వారు పార్టీ మారే విషయంలో బెట్టుచూపకపోవడం విశేషం. పార్టీలో పదవులకు రాజీనామా చేసినా.. బండి సంజయ్ నేతృత్వంలో పనిచేస్తామంటున్నారు. టికెట్ దక్కకపోయినా అధిష్టానం చెప్పినట్టు చేస్తామన్నారు. అయితే వీరంతా కలసి తుల ఉమని ఓడించడానికి పనిచేస్తారని వేరే చెప్పక్కర్లేదు. దీంతో ఈటల వర్గం టెన్షన్ లో పడింది. అసమ్మతిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

Tags:    
Advertisement

Similar News