తెలంగాణలో ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్‌

సాధారణంగా ఈ ప్రచారం కోసం ఎన్నికల కమిషన్‌ సమాజంలో పేరున్న ప్రముఖులను, నటీనటులను, సెలబ్రిటీలను, సామాజికవేత్తలను ప్రచారకర్తలుగా ఎంపిక చేస్తుంది. ఇప్పుడు తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను ఇందుకు ఎంపిక చేయడం విశేషం.

Advertisement
Update: 2023-09-20 03:02 GMT

తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ఈసారి సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్‌ తరఫున ప్రచారానికి ఒక ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేసింది. ఓటరు నమోదు, సవరణ, మార్పులు చేర్పులు, ఓటు వినియోగం ప్రయోజనాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ట్రాన్స్‌జెండర్‌ను ప్రచారకర్తగా వినియోగిస్తారు.

సాధారణంగా ఈ ప్రచారం కోసం ఎన్నికల కమిషన్‌ సమాజంలో పేరున్న ప్రముఖులను, నటీనటులను, సెలబ్రిటీలను, సామాజికవేత్తలను ప్రచారకర్తలుగా ఎంపిక చేస్తుంది. ఇప్పుడు తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను ఇందుకు ఎంపిక చేయడం విశేషం.

వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ లైలా ఈసారి ప్రచారకర్తగా ఎంపికయ్యారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్‌జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తుండటం గమనార్హం. వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో వారంలో ఒకరోజు వారికి ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేయించారు.

*

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC