రేవ్ పార్టీ.. హమ్మయ్య, నా పేరు లేదు

మీడియా కూడా నవదీప్ ని చాలాసార్లు టార్గెట్ చేసింది. సినీ నటులు పట్టుబడ్డారంటే కచ్చితంగా నవదీప్ పేరుతో కథనాలు వచ్చేవి.

Advertisement
Update: 2024-05-26 05:53 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలకంటే హాట్ టాపిక్ గా మారింది బెంగళూరు రేవ్ పార్టీ. ఏపీ, తెలంగాణకు సంబంధించి రాజకీయ నాయకులు, వారి అనుచరులు, సినీ తారలు ఈ రేవ్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే కాకాణి స్టిక్కర్.. రేవ్ పార్టీ వద్ద పట్టుబడిన కారులో ఉండటంతో టీడీపీ రెచ్చిపోతోంది. పార్టీకి హాజరైన వారిలో కొందరు గతంలో లోకేష్ తో దిగిన ఫొటోలను ఇప్పుడు వైసీపీ వైరల్ చేస్తోంది. ఈ క్రమంలో ఓ తెలుగు హీరో తన పేరు రేవ్ పార్టీ పుకార్లలో లేనందుకు తెగ సంబరపడిపోతున్నారు. ఆయనే నవదీప్.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ, ఎప్పుడు డ్రగ్స్ కేసుల్లో విచారణ జరిగినా సినీ ఇండస్ట్రీ నుంచి అటెండెన్స్ వేయించుకునే మొదటి వ్యక్తి హీరో నవదీప్. నవదీప్ ని పలుమార్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లు విచారించాయి. మీడియా కూడా నవదీప్ ని చాలాసార్లు టార్గెట్ చేసింది. సినీ నటులు పట్టుబడ్డారంటే కచ్చితంగా నవదీప్ పేరుతో కథనాలు వచ్చేవి. కానీ తొలిసారిగా బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నవదీప్ పేరు వినిపించలేదు. దీనిపై ఆయన తొలిసారిగా స్పందించారు. ఇన్నాళ్లకు మీడియా తనని వదిలిపెట్టిందని సంతోషపడ్డారు.

తాను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్టు రూమర్స్‌ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని సెటైరిక్ గా మాట్లాడారు నవదీప్. ‘ఏంటన్నా. ఈసారి నువ్వు ఫేక్‌ న్యూస్‌లో కనిపించడంలేదు’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా కొందరు అభిమానులు అడిగారని అన్నారు. ఈసారి మాత్రం తనకు మంచే జరిగిందని, తనను ఈ ఒక్కసారి మీడియా వదిలేసిందని చెప్పారు. రేవ్‌ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగే పార్టీ అని కూడా తనదైన శైలిలో నిర్వచనం ఇచ్చారు నవదీప్. మొత్తానికి ఈసారి నవదీప్ పేరు వార్తల్లో లేకపోవడం విశేషమేనని చెప్పాలి. 

Tags:    
Advertisement

Similar News