తెలంగాణ ప్రజలకు ప్రభాస్, విజయ్ దేవరకొండ శుభాకాంక్షలు

తెలుగు సినీరంగానికి సంబంధించి హీరో ప్రభాస్, విజయ్ దేవరకొండ, గేయ రచయిత చంద్రబోస్ శుభాకాంక్షల వీడియోలు విడుదల చేశారు.

Advertisement
Update: 2023-06-02 01:50 GMT

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సినీ నటులు, క్రీడాకారులు, వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీరంగానికి సంబంధించి హీరో ప్రభాస్ ఓ వీడియో సందేశాన్నిచ్చారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు అంటూ వీడియో విడుదల చేశారు ప్రభాస్.


Full View

కేసీఆర్ సర్కారుకి విజయ్ అభినందనలు..

హీరో విజయ్ దేవరకొండ కూడా శుభాకాంక్షల వీడియో విడుదల చేశారు. తెలంగాణ పదేళ్ల పండగ అంటూ ఆయన తన సంతోషాన్ని ప్రేమను వ్యక్తపరిచారు. ప్రజలపై ప్రేమతో, పట్టుదలతో పనిచేస్తే ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో చూపించిన మన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు అని చెప్పారు విజయ్.


Full View

కళాకారులు, క్రీడాకారుల శుభాకాంక్షల వెల్లువ..

ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గెలుచుకున్న గేయ రచయిత చంద్రబోస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి పథంలో దూసుకెళ్తూ, దేశానికే తలమానికంగా మారి.. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ప్రజలకు శుభాకాంక్షలు అంటూ సందేశం వినిపించారు చంద్రబోస్.


Full View

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాక్సర్లు నిఖత్ జరీన్, మహ్మద్ హస్సముద్దీన్.. సహా పలువురు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News