తెలంగాణలో నామినేషన్ల్ ప్రక్రియ షురూ.. తొలి నామినేషన్ వేసింది ఎవరంటే..

ఈ రోజు నుంచి నవంబర్ 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

Advertisement
Update: 2023-11-03 06:16 GMT

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఉదయం 11 గంటలకు విడుదలైంది. 119 నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరించే సహాయ రిటర్నింగ్ అధికారుల పేర్లు, రిటర్నింగ్ అధికారి కార్యాలయం చిరునామాలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి అన్ని నియోజకవర్గాల్లో ఫారం-1ను విడుదల చేశారు. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది.

రాష్ట్రంలో తొలి నామినేషన్ ఖమ్మంలో దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు ఉదయం 11 గంటలకే రిటర్నింగ్ అధికారి (ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్) కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగానే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించారు. నోటిఫికేషన్ విడుదలైన అరగంట లోపే రాష్ట్రంలో వీరిద్దరూ నామినేషన్ పత్రాలు అందించడం గమనార్హం. ఇక కోదాడ నియోజకవర్గం నుంచి సుధీర్ కుమార్ జలగం అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా ఆన్‌లైన్‌లో తొలి నామినేషన్ వేశారు.

కాగా, ఈ రోజు నుంచి నవంబర్ 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 5న ఆదివారం సందర్భంగా నామినేషన్లు స్వీకరించరు. నవంబర్ 13న నామినేషన్లు పరిశీలిస్తారు. నవంబర్ 15 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయా నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల వివరాలను రిటర్నింగ్ అధికారులు వెల్లడించనున్నారు.


Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC