అప్లై చేయకుండానే గ్రూప్-1 హాల్ టికెట్ జారీ చేశామనే వార్త అబద్దం : టీఎస్‌పీఎస్సీ

అప్లై చేయకుండానే ఒక అభ్యర్థికి హాల్ టికెట్ జారీ చేశామనే వార్త ఒకటి ప్రచారంలో ఉన్నది. అది అబద్ధమని కమిషన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Advertisement
Update: 2023-06-12 14:15 GMT

టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 కోసం అప్లై చేయకుండానే ఒక అభ్యర్థికి హాల్ టికెట్ జారీ చేశామనే వార్త ఒకటి ప్రచారంలో ఉన్నది. అది అబద్ధమని కమిషన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. జక్కుల సుచరిత అనే అభ్యర్థి గ్రూప్-1 కోసం దరఖాస్తు చేయలేదని, కేవలం గ్రూప్-3,. గ్రూప్-4 కోసం అప్లై చేస్తే ఆమెకు గ్రూప్-1 హాల్ టికెట్ జారీ చేసినట్లు మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అది తప్పుడు ప్రచారమని టీఎస్‌పీఎస్సీ పేర్కొన్నది.

జక్కుల సుచరిత.. తండ్రి పేరు జక్కుల శ్రీధర్ అనే అభ్యర్థిని గతేడాది గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసింది. ఆమెకు టీఎస్‌పీఎస్సీ టీఎస్1201206420 అనే ఐడీ నెంబర్ కూడా కేటాయించింది. నిరుడు అక్టోబర్ 16న తొలి సారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించినప్పడు నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ఏహచ్ఎంవీ జూనియర్ కళాశాలలో పరీక్ష రాసింది. తను పరీక్షకు హాజరయినట్లు నామినల్ రోల్స్‌లో సంతకం కూడా చేశారని.. కమిషన్ వద్ద దీనికి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నట్లు తెలిపారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి.. ఈ ఏడాది జూన్ 11న తిరిగి నిర్వహించాము. గతంలో దరఖాస్తు చేసిన వారందరికీ హాల్ టికెట్లు జారీ చేస్తున్నట్లు ముందుగానే పేర్కొన్నాము. అంతే కాకుండా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోని వారి మొబైల్ నెంబర్లకు ఎస్ఎంఎస్‌ కూడా పంపించాము. దీంతో చాలా మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొని పరీక్ష రాశారు. జక్కుల సుచరిత అసలు గ్రూప్-1 అసలు దరఖాస్తే చేయకుండా హాల్ టికెట్ జారీ చేశామన్నది పూర్తిగా అవాస్తవమని టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC