2025 కల్లా తెలంగాణలో 53 వేల మంది క్యాన్సర్ పేషెంట్లు.. ఐసీఎంఆర్ నివేదికలో వెల్లడి

ఐసీఎంఆర్ కొన్నా ళ్ల క్రితం 'ప్రోఫైల్ ఆఫ్ క్యాన్సర్ అండ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ - తెలంగాణ 2021' పేరిట ఒక అధ్యయనం చేసింది. ఇందులో విస్తుగొలిపే నిజాలు వెల్లడయ్యాయి.

Advertisement
Update: 2023-02-04 13:52 GMT

తెలంగాణ రాష్ట్రంలోని క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య 2025 కల్లా 53 వేలకు చేరుకుంటుందని ఓ నివేదికలో వెల్లడైంది. బెంగళూరు బేస్‌గా పని పని చేస్తున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కొన్నా ళ్ల క్రితం 'ప్రోఫైల్ ఆఫ్ క్యాన్సర్ అండ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ - తెలంగాణ 2021' పేరిట ఒక అధ్యయనం నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదికను వరల్డ్ క్యాన్సర్ డే (ఫిబ్రవరి 4) సందర్భంగా విడుదల చేసింది. ఇందులో విస్తుగొలిపే నిజాలు వెల్లడయ్యాయి.

పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ (పీపీబీఆర్), హాస్పిటల్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ (హెచ్‌బీసీఆర్) గణాంకాలను ఒక చోట చేర్చి ఈ నివేదికను ఐసీఎంఆర్ విడుల చేసింది. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఏడాది సగటున 3,865 మందికి కొత్తగా క్యాన్సర్ సోకుతోందని అంచనా వేసింది. ఈ క్యాన్సర్ ఫ్యాక్ట్ షీట్‌లో అనేక విషయాలు వివరించారు. క్యాన్సర్ ఎపిడోమియాలాజికల్ ప్రొఫైల్ (వ్యాధిని గుర్తించడం, వ్యాప్తి, నియంత్రణ)ను తెలియజేయడమే కాకుండా.. తెలంగాణలో క్యాన్సర్ ప్యాట్రన్ ఎలా ఉంటుందో కూడా చెప్పింది. ఈ వివరాలను నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ 2020 నివేదిక నుంచి తీసుకున్నారు.

ఐసీఎంఆర్ నివేదికలో క్యాన్సర్ ఎలాంటి వ్యక్తులకు సోకుతోంది, వారి సామాజిక స్థాయి, ఆరోగ్య లక్షణాల ఎలా ఉన్నాయనే విషయాలను తెలియజేయడంతో పాటు హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా వివరాలు సమర్పించారు. క్యాన్సర్ గురించి ఇటీవల కాలంలో విస్తృతంగా వెల్లడించి రిపోర్ట్ ఇదే కావడం గమనార్హం.

తెలంగాణలో మహిళ, పురుషుల్లో బ్రెస్ట్, నోటి క్యాన్సర్ ఎక్కువగా కనపడుతోందని తెలిపింది. ఈ నివేదికను బట్టి 0 నుంచి 74 ఏళ్ల వయసున్న ప్రతీ తొమ్మిది మంది పురుషుల్లో ఒకరికి, ప్రతీ ఏడుగురు మహిళల్లో ఒకరికి శరీరంలోని ఏ భాగానికైనా క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇక ప్రతీ 10 లక్షల మంది మేల్ చిల్డ్రన్‌లో 55 మంది, ఫీమేల్ చిల్డ్రన్‌లో 39 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉన్నట్లు తేల్చి చెప్పింది.

కాగా, యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో 2008లో వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్‌ జరిగింది. దీని ప్రకారం ప్రతీ ఏడాది ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకుంటున్నారు.


క్యాన్సర్ పేషెంట్లకు అండగా తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ ప్రభుత్వ క్యాన్సర్ పేషంట్లకు అండగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్ర చికిత్సలను ఉచితంగా చేయిస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకునే క్యాన్సర్ పేషెంట్లకు తిరగడానికి ఉచిత పాస్‌తో పాటు మందులు కూడా ఇస్తోంది. ప్రతీ నెల ఈ పేషెంట్లకు ఫించన్ కూడా మంజూరు చేస్తోంది. ఇటీవల క్యాన్సర్ పేషెంట్లకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఇందులో వారికి అవసరమైన మెడిసిన్స్‌తో పాటు ఇతర వస్తువులను అందిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC