తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ తేదీ ఖరారు

ప్రిలిమ్స్‌ రాత పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Advertisement
Update: 2024-02-27 01:35 GMT

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది TSPSC. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇటీవలే 560 పోస్టులకు గ్రూప్‌ - 1 నోటిఫికేషన్‌ రిలీజ్ కాగా.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ర‌ద్దు చేసిన‌ రేవంత్ సర్కార్‌.. అదనంగా మరో 60 పోస్టులు జోడిండి కొత్త నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసింది. ప్రిలిమ్స్‌ రాత పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే అభ్యర్థులు పెద్ద ఎత్తున గ్రూప్‌-1 పరీక్షలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు ఇటీవల పెంచిన విషయం తెలిసిందే.

పాత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వాళ్లు మళ్లీ అప్ల‌య్‌ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది TSPSC. అయితే.. గతంలో ఫీజు చెల్లించిన వాళ్లు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ జరగనుంది. మెయిన్ పరీక్షను హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహించనున్నారు.

Tags:    
Advertisement

Similar News