తెలంగాణ భగీరథ ప్రయత్నం.. భారీగా పెరిగిన భూగర్భ నీటిమట్టం

2013లో తెలంగాణ ప్రాంతంలో భూగర్భ జలాలు 472 టీఎంసీలు.. 2023నాటికి తెలంగాణలో భూగర్భ జలాలు 739 టీఎంసీలు.

Advertisement
Update: 2023-09-30 04:40 GMT

ప్రయత్నం అందరూ చేస్తారు, కానీ దానికి తగ్గ ఫలితాలు సాధించేవారే కార్యసాధకులు. తెలంగాణ ఏర్పాటుతో ఆ విషయాన్ని రుజువు చేసిన సీఎం కేసీఆర్, తెలంగాణ జలవనరుల సాధనకు నడుంబిగించి ఊహించని ఫలితాలు సాధించి చూపించారు. తెలంగాణ భూగర్భ జలమట్టాలు రికార్డు స్థాయిలో పెరగడం దీనికి తాజా ఉదాహరణ.

2013లో తెలంగాణ ప్రాంతంలో భూగర్భ జలాలు 472 టీఎంసీలు..

2023నాటికి తెలంగాణలో భూగర్భ జలాలు 739 టీఎంసీలు.

ఏకంగా 56శాతం వృద్ధి.

రాష్ట్రస్థాయి కమిటీ సమావేశంలో భూగర్భ జలవనరుల శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. భూగర్భ జలమట్టంపై రూపొందించిన ‘డైనమిక్‌ గ్రౌండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌-2023’ నివేదికను ఈ సమావేశం ఆమోదించింది.

భగీరథ ప్రయత్నం..

సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం వల్లే ఈ ఘనత సాధ్యమైందని అంటున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో చేపట్టిన మిషన్‌ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం ఎత్తిపోతలు, కృత్రిమ భూగర్భ రీఛార్జి నిర్మాణాల ద్వారా నీటిమట్టం పెరిగిందని చెబుతున్నారు. రాష్ట్ర భూగర్భ జలమట్టం భారీగా వృద్ధి చెందిందని ఇంజినీరింగ్‌ నిపుణులు పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 83 శాతం మండలాల్లో భూగర్భజలాల పెరుగుదల నమోదవడం మరో రికార్డు. 

Tags:    
Advertisement

Similar News