మరో 11 మంది IASల బదిలీ.. అరవింద్‌కుమార్‌పై వేటు..!

విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి. వెంకటేశంకు బాధ్యతలు అప్పగించింది. ఇక జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాను నియమించింది.

Advertisement
Update: 2023-12-17 11:36 GMT

తెలంగాణలో మరో 11 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్పెషల్‌ సీఎస్‌గా ఉన్న అర‌వింద్‌ కుమార్‌ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది. గతంలో అరవింద్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది కాంగ్రెస్‌. ఇక విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి. వెంకటేశంకు బాధ్యతలు అప్పగించింది. ఇక జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాను నియమించింది.

- విపత్తు నిర్వహణ శాఖకు అరవింద్‌కుమార్‌ బదిలీ

- విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి.వెంకటేశం

- మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్‌

- హైదరాబాద్ వాటర్‌వర్క్స్‌ ఎండీగా సుదర్శన్ రెడ్డి

- వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా శ్రీదేవి

- మహిళా- శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి అరుణ

- జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా

- ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా కర్ణన్‌

- రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా శ్రీనివాస్ రాజు

- అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణి ప్రసాద్‌

- ప్రభుత్వ కార్యదర్శిగా ఐఏఎస్‌ క్రిస్టినా చొంగ్తు

Tags:    
Advertisement

Similar News