తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే..

జనవరి 12న ఆప్షనల్ హాలిడే, 13న రెండో శనివారం చాలా స్కూళ్లకు హాలిడే. అలాగే 14న భోగి పండుగ, 15న సోమవారం సంక్రాంతి సాధారణ హాలిడే ఉంటుంది. అలాగే జనవరి 16న కనుమ హాలిడే ఇచ్చారు.

Advertisement
Update: 2024-01-03 09:22 GMT

జనవరి వచ్చిందంటే చాలు స్కూల్ పిల్లలు హాలిడేస్ కోసం ఎదురుచూస్తారు. కొత్త సంవత్సరం, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా నెల మొత్తం సెలవులతోనే గడిచిపోతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవుల్ని ప్రకటించింది. మొత్తం 6 రోజులు సంక్రాంతి హాలిడేస్‌ ఇచ్చింది రేవంత్ సర్కారు. జనవరి 12 నుంచి 17 వరకు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.

జనవరి 12న ఆప్షనల్ హాలిడే, 13న రెండో శనివారం చాలా స్కూళ్లకు హాలిడే. అలాగే 14న భోగి పండుగ, 15న సోమవారం సంక్రాంతి సాధారణ హాలిడే ఉంటుంది. అలాగే జనవరి 16న కనుమ హాలిడే ఇచ్చారు. అదనంగా జనవరి 17న సెలవు ఇచ్చారు. మిషనరీ స్కూళ్లు తప్పా మిగతా అన్ని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాలేజీలకు సెలవులు ఎన్నిరోజులు అన్నదానిపై ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

అలాగే జనవరి 25 ఆదివారం, 26న రిపబ్లిక్ డే ఉండటంతో పిల్లలకు మరో రెండురోజులు సెలవులు దొరకనున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు సిలబస్ పేరిట పండుగ హాలీడేస్‌లలో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది.

Tags:    
Advertisement

Similar News