కేసీఆర్‌కు ఇన్విటేషన్‌పై కాంగ్రెస్‌ క్లారిటీ!

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు హరీష్‌ రావు.. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలను సైతం ఆహ్వానించి సన్మానం చేస్తారని ప్రచారం జరిగింది.

Advertisement
Update: 2024-05-26 04:07 GMT

జూన్ 2 నాటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా సోనియాగాంధీని ఆహ్వానించి సన్మానించాలని ప్లాన్ చేశారు.

తెలంగాణ ఉద్యమకారులు, కవులు, రచయితలను కూడా ఆహ్వానిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు హరీష్‌ రావు.. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలను సైతం ఆహ్వానించి సన్మానం చేస్తారని ప్రచారం జరిగింది.

అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి. ఆవిర్భావ వేడుకలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలను ఆహ్వాంచబోమన్నారు. ఆ రెండు పార్టీలు మినహా తెలంగాణ కోసం పని చేసిన అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యులను ప్రభుత్వం ఆహ్వానిస్తుందన్నారు.

Tags:    
Advertisement

Similar News