ఇవాళ టీ.కేబినెట్‌ మీటింగ్‌.. మిగిలిన పథకాలకు గ్రీన్ సిగ్నల్!

ఇవాళ జరిగే మంత్రి మండలి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.

Advertisement
Update: 2024-03-12 05:27 GMT

ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగనుంది. మరో మూడు, నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ కేబినెట్‌ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవాళ జరిగే మంత్రి మండలి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల ఎంపికపైనా సమావేశంలో చర్చిస్తారని సమాచారం. దీంతో పాటు అర్హులైన మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, రైతులను బోనస్‌, కౌలు రైతులతో వ్యవసాయ కూలీలకు సాయంపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ఆరు గ్యారెంటీల్లో భాగంగా సోమవారం భద్రాచలం ఇందిరమ్మ ఇండ్ల స్కీంను ప్రారంభించారు రేవంత్. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు లాంటి పథకాలను ప్రారంభించారు.

Tags:    
Advertisement

Similar News