ఈనెల 31న కేబినెట్ భేటీ.. ఆగస్ట్ 3నుంచి తెలంగాణ అసెంబ్లీ

ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాల పెంపు ఈసారి కేబినెట్ భేటీలో కీలక అంశం కాబోతోంది. వరదలతో నష్టపోయిన ప్రజలు, ముంపు ప్రాంతాల వాసులకు ఇచ్చే పరిహారంపై కూడా ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Advertisement
Update: 2023-07-28 09:50 GMT

ఈనెల 31న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. నూతన సచివాలయంలో కేబినెట్‌ భేటీ నిర్వహించబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వరదలు, సహాయక చర్యలు, నష్టపరిహారం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. వరదలతోపాటు సుమారు 50 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అకాల వర్షాలతో రైతన్నల ఇబ్బందులు, ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్‌ లో చర్చిస్తారని తెలుస్తోంది.

ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాల పెంపు ఈసారి కేబినెట్ భేటీలో కీలక అంశం కాబోతోంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపుపై చాన్నాళ్లుగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఈ కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. వరదలతో నష్టపోయిన ప్రజలు, ముంపు ప్రాంతాల వాసులకు ఇచ్చే పరిహారంపై కూడా ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఆగస్ట్-3నుంచి అసెంబ్లీ..

ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన సందర్భంలో బహుశా ఇవే చివరి సమావేశాలు కావొచ్చు. ఈ సమావేశాల్లో విపక్షాలు విమర్శనాస్త్రాలతో సిద్ధమవుతాయనే అంచనాలుండగా.. ప్రభుత్వం ముందుగానే వాటికి విరుగుడు ఆలోచించి సమావేశాలకు సన్నద్ధమవుతోంది. మొత్తమ్మీద ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది.  

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC