నేడు తెలంగాణ కేబినెట్ భేటీ లేదు.. ఎందుకంటే..?

మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న సందర్భంలో ఇదే చివరి భేటీ అవుతుందని అనుకున్నారు. కానీ ఈరోజు కేబినెట్ సమావేశం జరగట్లేదు.

Advertisement
Update: 2023-09-27 23:30 GMT

ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో తెలంగాణ కేబినెట్ భేటీ ఆసక్తిగా మారింది. రెండు మూడు రోజులుగా కేబినెట్ భేటీ గురించే చర్చ జరుగుతోంది. దళిత బంధు, బీసీ బంధు లాగా మహిళా బంధు ప్రకటిస్తారని, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటారని, రైతుబంధు ఆర్థిక సాయం పెంపు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలుపుతుందని.. ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. కానీ కేబినెట్ ఈరోజు(శుక్రవారం) భేటీ కావడం లేదని మాత్రం స్పష్టమైంది.

వాస్తవానికి కేబినెట్ భేటీ గురించి ఎక్కడా అధికారిక సమాచారం లేదు. ఓ దశలో అసలు భేటీయే లేదని, అవన్నీ ఊహాగానాలేనని కొంతమంది అధికార పార్టీ నేతలే చెప్పుకొచ్చారు. చివరిగా ఈరోజు జరుగుతుంది అనుకున్న కేబినెట్ భేటీ లేదు అని తేలిపోయింది. మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న సందర్భంలో ఇదే చివరి భేటీ అవుతుందని అనుకున్నారు. కానీ ఈరోజు కేబినెట్ సమావేశం జరగట్లేదు.

కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడ్డాక..

ఒకవేళ నిజంగానే కేబినెట్ భేటీ ఖరారు అయితే, కేసీఆర్ అనారోగ్యం వల్ల అది వాయిదా పడిందని అనుకోవాలి. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత మంత్రిమండలిని సమావేశపరిచే అవకాశముంది. అక్టోబర్ మొదటి వారంలో కేబినెట్ భేటీ ఉంటుందని ప్రగతి భవన్ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై చర్చ, ఎన్నికల వేళ బీఆర్ఎస్ మేనిఫెస్టో ఖరారు, కొత్త పథకాల రూపకల్పనపై మంత్రుల అభిప్రాయం.. ఇలాంటివన్నీ మంత్రిమండలి ముందుకు వచ్చే అవకాశముంది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్​ ను నామినేట్ చేస్తూ మరోసారి మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశముంది. వారిద్దరి పేర్లను కేబినెట్ ఆమోదించి మళ్లీ గవర్నర్ కి పంపించే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News