అభ్యర్థులైతే లేరు.. ప్రచారమైతే జోరు.!

ఇప్పుడు మరో నలుగురు కేంద్రమంత్రులు ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు రానున్నారట. అక్టోబర్ 14 నుంచి ఐదు రోజుల పాటు వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

Advertisement
Update: 2023-10-11 02:42 GMT

తెలంగాణ బీజేపీ ఇప్పటివరకూ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. అసలు ఆ దిశగా సీరియస్‌గా ప్రయత్నాలు జరుగుతున్నట్లు పెద్దగా కనిపించట్లేదు. కానీ, ప్రచారమైతే జోరుగా నడుస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ రెండు బహిరంగ సభలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ సభలో పాల్గొన్నారు. ఇక ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం కార్యకర్తలు నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఇప్పుడు మరో నలుగురు కేంద్రమంత్రులు ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు రానున్నారట. అక్టోబర్ 14 నుంచి ఐదు రోజుల పాటు వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అక్టోబర్‌ 14న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తారు. మరో కేంద్రమంత్రి నిరంజన్ జ్యోతి అక్టోబర్ 15న ముషీరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తారు.

ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఈ నెల 16న హుజూరాబాద్, మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొంటారు. ఈ నెల 19న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో కేంద్రమంత్రి అబ్బయ్య నారాయణ స్వామి పర్యటిస్తారు. వీరితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు సైతం తెలంగాణకు ప్రచారం కోసం వస్తారని బీజేపీ నేతలు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News