తెలంగాణలో టీచర్ల బదిలీలు.. 81వేలమంది దరఖాస్తులు

మొత్తం అప్లికేషన్లలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 4,722 వచ్చాయి. అత్యల్పంగా ములుగులో 781 మంది, జయశంకర్ భూపాలపల్లినుంచి 1,068 మంది మాత్రమే బదిలీకోసం దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement
Update: 2023-09-07 02:16 GMT

తెలంగాణలో టీచర్ల బదిలీ దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తం 81,069 మంది బదిలీకోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నారు. కొత్తగా 6,968 మంది దరఖాస్తు చేసుకోగా.. ఫిబ్రవరిలో దరఖాస్తు చేసిన వారు 74,101 మంది ఉన్నారు. 70,762 మంది దరఖాస్తుల్లో మార్పులు చేర్పులు చేసుకున్నారు.

రంగారెడ్డిలో అత్యధికం..

మొత్తం అప్లికేషన్లలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లానుంచి 4,722 వచ్చాయి. నల్గొండ నుంచి 4,416, నిజామాబాద్‌‌‌‌ నుంచి 4,088, సంగారెడ్డి నుంచి 4,038 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యల్పంగా ములుగులో 781 మంది, జయశంకర్ భూపాలపల్లినుంచి 1,068 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.

డీఈఓ ఆఫీస్ లో దరఖాస్తులు..

ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్నా కూడా ఆఫ్ లైన్ లో వాటిని డీఈఓ ఆఫీస్ లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా బుధవారం మొదలైంది. దరఖాస్తులను డీఈఓ ఆఫీస్ లో సమర్పించడానికి ఈరోజు చివరి రోజు. రేపు, ఎల్లుండి.. సీనియార్టీ లిస్టులను వెబ్‌‌‌‌ సైట్లలో పెడతారు. 10, 11 తేదీల్లో ఈ లిస్టులపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 12, 13 తేదీల్లో సీనియార్టీ లిస్ట్ లను డీఈఓ ఆఫీసుల్లో డిస్‌‌‌‌ ప్లే చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత హెడ్మాస్టర్ల బదిలీలు మొదలవుతాయి.

ఈ నెల 15నుంచి హెడ్మాస్టర్ల బదిలీలు మొదలవుతాయి. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ లకు హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చి వారి బదిలీలు చేపడతారు. 23, 24 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ ల బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత ఎస్జీటీలకు పదోన్నతులిస్తారు. పదోన్నతుల తర్వాత ఎస్జీటీల బదిలీలు మొదలవుతాయి.

Tags:    
Advertisement

Similar News