కడియంకు షాక్‌.. కాంగ్రెస్‌ కార్యకర్తల తిరుగుబాటు..!

నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానన్నారు సింగాపురం ఇందిర. ఈ సభా వేదికగా గత 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ కార్యకర్తలను కడియం వేధించిన తీరు, కడియం రాకను కార్యకర్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్తానన్నారు.

Advertisement
Update: 2024-03-30 05:29 GMT

మాజీమంత్రి కడియం శ్రీహరి రాకను స్టేషన్‌ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సింగాపురం ఇందిర కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గత 30 ఏళ్లుగా కడియం స్టేషన్‌ ఘన్‌పూర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన విషయాన్ని పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ దృష్టికి తీసుకెళ్లారు. కడియంను పార్టీలో చేర్చుకోవద్దని కోరారు.

రాబోయే రెండు రోజుల్లో నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తానన్నారు సింగాపురం ఇందిర. ఈ సభా వేదికగా గత 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ కార్యకర్తలను కడియం వేధించిన తీరు, కడియం రాకను కార్యకర్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్తానన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఇందిర.

శుక్రవారం కడియం శ్రీహరి ఇంటికి వెళ్లిన దీపాదాస్ మున్షీ ఆయనతో పాటు ఆయన కూతురిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కడియం శ్రీహరి లేదా కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలిచే అవకాశాలున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిరపై 7 వేల ఓట్ల తేడాతో కడియం శ్రీహరి విజయం సాధించారు. 

Tags:    
Advertisement

Similar News