సంతోషంలో ఎక్కువ లాగించేస్తున్న హైదరాబాదీలు..

సంతోషంగా ఉన్నప్పుడు చిరుతిండితో కడుపునింపుకునేవారి లిస్ట్ లో ఢిల్లీ టాప్ ప్లేస్ లో ఉంది. 81శాతం మంది అక్కడ సంతోషంగా ఉన్నప్పుడు స్నాక్స్ తీసుకుంటామని చెప్పారు.

Advertisement
Update: 2023-03-22 09:52 GMT

హైదరాబాద్ లో ఫుడ్ లవర్స్ ఎక్కువ. నగరంలో ఉన్న మల్టీక్యూసిన్ రెస్టారెంట్లు, లెక్కలేనన్ని చిన్న చిన్న హోటళ్లు, ఫుడ్ పార్క్ లు దీనికి నిదర్శనం. ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారు హైదరాబాద్ బిర్యానీతోపాటు మిగతా వంటకాలను కూడా ఇష్టంగా లాగించేస్తుంటారు. హైదరాబాద్ కి ఇప్పుడు మరో ఘనత కూడా దక్కింది. చిరుతిండి విషయంలో హైదరాబాద్ దక్షిణాదిలో టాప్ ప్లేస్ లో నిలిచింది, దేశవ్యాప్తంగా సెకండ్ ప్లేస్ సాధించింది. చిరుతిండి తీసుకునే వారిపై గోద్రెజ్ యమ్మీజ్ నిర్వహించిన సర్వేలో ఆసక్తిర విషయాలు వెల్లడయ్యాయి. చిరుతిండి విషయంలో ఢిల్లీ టాప్ ప్లేస్ లో ఉండగా.. హైదరాబాద్, చెన్నై కామన్ గా రెండో స్థానం దక్కించుకున్నాయి.

ది ఇండియా స్నాకింగ్ రిపోర్ట్.. పేరుతో గోద్రెజ్ యమ్మీజ్ ఓ సర్వే చేపట్టింది. సంతోషంగా ఉన్నప్పుడే చాలామంది చిరుతిండివైపు చూస్తారని ఈ సర్వేలో తేలింది. అలా సంతోషంగా ఉన్నప్పుడు చిరుతిండితో కడుపునింపుకునేవారి లిస్ట్ లో ఢిల్లీ టాప్ ప్లేస్ లో ఉంది. 81శాతం మంది అక్కడ సంతోషంగా ఉన్నప్పుడు స్నాక్స్ తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్, చెన్నై 77 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. కోల్ కతా స్కోర్ 75 కాగా, ముంబైలో కేవలం 68శాతం మంది మాత్రమే స్నాక్స్ తీసుకుంటున్నట్టు తెలిపారు.

సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా ఆహారాన్ని కాస్త ఎక్కువగా తీసుకుంటారని ఇప్పటికే రకరకాల సర్వేలు తెలిపాయి. ఆహారంతోపాటు స్నాక్స్ విషయంలో కూడా సంతోషమే సగం కారణం అని తాజా సర్వే స్పష్టం చేసింది. సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ స్నాక్స్‌ తీసుకునేవారిలో మహిళలే కొంచెం అధికంగా ఉన్నారు. ఫుడ్‌– మూడ్‌ కనెక్షన్‌ విషయం పురుషుల్లో 70శాతం కాగా, మహిళల్లో 74 శాతం కావడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News