మహిళను బ‌స్సు ఎక్కించుకోని RTC డ్రైవర్.. ఆమె ఏం చేసిందంటే..!

ఇదంతా చూసి బస్సులోని మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు అడ్జస్ట్ అయితే సరిపోతుంది. 5 నిమిషాలు ఆగితే ఇంకో బస్సు వస్తుంది కదా అన్నారు.

Advertisement
Update: 2024-05-09 09:28 GMT

తెలంగాణలో ఫ్రీ బస్సు కష్టాలు కొనసాగుతున్నాయి. లక్డీకపూల్‌లో బస్సు ఓవర్ లోడ్ అయిందనే సాకుతో మహిళను బస్సు ఎక్కించుకునేందుకు ఆర్టీసీ డ్రైవర్ నిరాకరించాడు. దీంతో ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను బస్సు ఎలా ఎక్కించుకోరు అంటూ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. ఎక్కించుకుంటావా లేదా అంటూ బస్సుకు అడ్డం తిరిగింది. తనను ఎక్కించుకుంటేనే బస్సు ముందుకు కదులుతుందంటూ భీష్మించుకు కూర్చుంది.

మహిళ ఆందోళనతో నడి రోడ్డుపైనే బస్సును ఆపేసి కిందకు దిగాడు డ్రైవర్. ఎక్కించుకునే సమస్యే లేదంటూ పంతానికి పోయాడు. బస్సు అడుగు కూడా ముందుకు తీయను అని తేల్చి చెప్పాడు. తాను బస్సు నడపలేనని.. కావాలంటే నువ్వే బండి తీసుకుపో అంటూ మహిళను అవమానించేలా మాట్లాడాడు. దీంతో మహిళ రివర్స్ అయింది. బస్సేమైనా నీదా అంటూ డ్రైవర్‌పై ఎదురుదాడికి దిగింది.

ఇదంతా చూసి బస్సులోని మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు అడ్జస్ట్ అయితే సరిపోతుంది. 5 నిమిషాలు ఆగితే ఇంకో బస్సు వస్తుంది కదా అన్నారు. ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉచిత బస్ పెట్టి మా ప్రాణాల మీదకు తెస్తున్నారంటూ డ్రైవర్ సైతం అసహనం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఫ్రీ బస్సు పథకమేమో కానీ, సరిపడా బస్సులు లేక ఇటు మహిళలు, అటు ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



Tags:    
Advertisement

Similar News