రూ.30కోట్లతో ఓట్ల కొనుగోలు..! రఘునందన్ ఆరోపణల్లో నిజమెంత..?

బ్యాంకుల్లో జరిగిన రూ.30కోట్ల లావాదేవీలకు తన వద్ద ఆధారాలున్నాయని అంటున్నారు రఘునందన్ రావు.

Advertisement
Update: 2024-05-26 09:12 GMT

ఎన్నికల సమయంలో గుడ్డకాల్చి మొహంమీద వేసేందుకు రాజకీయ నాయకులు రెడీగా ఉంటారు. ఎదుటివారిపై బురదజల్లేసి సైలెంట్ అవుతారు, అది కడుక్కోవడం, సచ్ఛీలత నిరూపించుకోవడం అవతలివారి పని అన్నట్టుగా వదిలేస్తారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. ఈ ఎన్నికల కోసం బీఆర్ఎస్ రూ.30కోట్లు ఖర్చు చేస్తోందని అంటున్నారాయన.

ఇవిగో ఆధారాలు..

బ్యాంకుల్లో జరిగిన రూ.30కోట్ల లావాదేవీలకు తన వద్ద ఆధారాలున్నాయని అంటున్నారు రఘునందన్ రావు. ఆ 30కోట్ల రూపాయలతో పట్టభద్రుల ఓట్లు కొనుగోలు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి 34మంది ఎన్నికల ఇన్ చార్జు లకు నగదు బదిలీ జరిగిందని నమ్మకంగా చెబుతున్నారు రఘునందన్ రావు. ఈమేరకు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆయన లేఖలు రాశారు.

బ్యాంక్ అకౌంట్ వివరాలు తన వద్ద ఉన్నాయని హడావిడి చేస్తున్నారు రఘునందన్ రావు. ఆ బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ బ్యాంక్ ఖాతానుంచి డబ్బులు వెళ్లింది ఎవరికి..? ఎందుకు..? అనేది ఆయనకు ఎలా తెలుసని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ ని తప్పుబట్టేందుకే ఆయన ఆరోపణలు చేస్తున్నారని, బ్యాంకు ఖాతాల పేరుతో ఈసీని, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News