ఎన్‌.వేణుగోపాల్ ఇంట్లో NIA సోదాలు

2018లో పుణే సమీపంలో భీమా-కొరెగాంలో హింస ప్రేరేపించడం సహా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో గతంలో వరవరరావును NIA అధికారులు అక్రమంగా అరెస్టు చేశారు.

Advertisement
Update: 2024-02-08 04:19 GMT

హైదరాబాద్‌లో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ- NIA సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే సిటీలో పలుమార్లు కేంద్ర దర్యాప్తు సంస్థ NIA సోదాలు నిర్వహించింది. ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచే సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్‌ ఎన్.వేణుగోపాల్ ఇంట్లో NIA అధికారులు సోదాలు చేస్తున్నారు.

వేణుగోపాల్‌ సామాజిక ఉద్యమకారుడు, విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు వరవరరావు మేనల్లుడు. వేణుగోపాల్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో హిమాయత్‌నగర్‌లోని ఆయన నివాసంలో NIA సోదాలు చేస్తోంది. ఇక ఎల్బీనగర్‌లోని రవిశర్మ ఇంట్లో కూడా NIA అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

2018లో పుణే సమీపంలో భీమా-కొరెగాంలో హింస ప్రేరేపించడం సహా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో గతంలో వరవరరావును NIA అధికారులు అక్రమంగా అరెస్టు చేశారు.

Tags:    
Advertisement

Similar News