నందమూరి కుటుంబానికి మరో అపాయం.. తప్పిన ప్రమాదం

ఓవైపు తారకరత్న ఆస్పత్రిలో ఉండగా, అదే కుటుంబంలోని మరో వ్యక్తి ఇలా కారు ప్రమాదానికి గురికావడంతో కలకలం రేగింది.

Advertisement
Update: 2023-02-11 06:59 GMT

నందమూరి కుటుంబానికి మరో అపాయం.. తప్పిన ప్రమాదం

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో నందమూరి తారకరత్న తీవ్రంగా అస్వస్థతకు గురై బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందంటున్నారే కానీ, తారకరత్న స్పృహలోకి వచ్చినట్టు మాత్రం తెలియడంలేదు.


తారకరత్న ఆరోగ్యం విషయంలో నందమూరి కుటుంబం విషాదంలో ఉన్న క్రమంలో తాజాగా మరో ప్రమాదం కలకలం రేపింది. అయితే ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు నందమూరి రామకృష్ణ. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన క్షేమంగా బయటపడ్డాడు.

కారు నుజ్జు నుజ్జు..

నందమూరి రామకృష్ణ తన కారును డ్రైవ్‌ చేసుకుంటూ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10 మీదుగా వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు రామకృష్ణ. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే కారు ముందు భాగం నుజ్జు నుజ్జయినట్టు తెలుస్తోంది.

ఓవైపు తారకరత్న ఆస్పత్రిలో ఉండగా, అదే కుటుంబంలోని మరో వ్యక్తి ఇలా కారు ప్రమాదానికి గురికావడంతో కలకలం రేగింది. రామకృష్ణకు గాయాలయ్యాయా, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందని కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి పరామర్శిస్తున్నారు చాలామంది. అయితే కారు ప్రమాదంలో ఆయనకు ఏమీ కాలేదని, కేవలం కారు డ్యామేజీ అయిందని చెబుతున్నారట కుటుంబ సభ్యులు.

Tags:    
Advertisement

Similar News