ఈటల.. ఇదేంది మరీ..!

తను ముదిరాజ్‌ బిడ్డనని చెప్పుకునే ఈటల.. తన కొడుకు, కూతురు పేర్ల చివర రెడ్డి అని ఎందుకు తగిలించారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Update: 2023-10-09 05:46 GMT

ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ముదిరాజ్‌ ఆత్మగౌరవ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స‌భ‌లో బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై పలువురు ముదిరాజ్ లీడర్లు, బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ముదిరాజ్‌లను కేసీఆర్ మోసం చేశారంటూ ఈటల చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్‌ నేతలు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇస్తున్నారు.

ఈటల ఎన్నికలకు ముందు ముదిరాజ్‌.. ఎన్నికల తర్వాత రెడ్డి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తను ముదిరాజ్‌ బిడ్డనని చెప్పుకునే ఈటల.. తన కొడుకు, కూతురు పేర్ల చివర రెడ్డి అని ఎందుకు తగిలించారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దమ్ముంటే బీజేపీ నుంచి ముదిరాజ్‌లకు 15 అసెంబ్లీ ఇప్పించాలని సవాల్ విసురుతున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 8 ఏళ్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ ముదిరాజ్ సామాజిక వర్గానికి చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముదిరాజ్‌ బిడ్డగా చెప్పుకుంటున్న ఈటలను తెలంగాణ తొలి ఆర్థిక మంత్రిని చేసింది కేసీఆర్ కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీలో తన తర్వాత స్థానం ఇచ్చి కేసీఆర్‌ గౌరవించింది నిజం కాదా అని అడుగుతున్నారు. ముదిరాజ్ బిడ్డలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు ఇచ్చింది నిజం కాదా అని ఈటలపై సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేవలం తన స్వార్థం కోసం ఈటల కులం కార్డు వాడుతున్నారని మండిపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News