ఒక్కొక్కటీ కాదు.. 100 ఆటోలు ఒకేసారి వచ్చేశాయి

జహీరాబాద్ LMM ప్లాంట్ లో ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఒకేసారి 100 ఆటోలను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రారంభించారు.

Advertisement
Update: 2023-06-06 05:54 GMT

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మహీంద్రా సంస్థ తయారు చేసిన 100 ఎలక్ట్రిక్ ఆటోలను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహీంద్రా సంస్థ యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందించారు.


మంత్రి కేటీఆర్ చొరవతో..

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికోసం మంత్రి కేటీఆర్ చొరవతో మహీంద్రా సంస్థ ముందుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటుకి జహీరాబాద్ ని ఎంపిక చేసుకుంది. లాస్ట్ మైల్ మొబిలిటీ (LMM) పేరుతో అక్కడ ప్లాంట్ నెలకొల్పింది. అనతి కాలంలోనే దాన్ని విస్తరించింది. మొత్తం వెయ్యికోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ త్రీవీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తున్నారు. వెయ్యిమందికి ఈ ప్లాంట్ ద్వారా ఉపాధి లభిస్తోంది.

జహీరాబాద్ LMM ప్లాంట్ లో ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఒకేసారి 100 ఆటోలను తాజాగా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రారంభించారు.హైదరాబాద్ రోడ్లపై ఈ వాహనాలు పరుగులు తీస్తాయని అంటున్నారు. కంపెనీ ప్రారంభానికి ప్రోత్సాహమిచ్చిన మంత్రి కేటీఆర్ కి సంస్థ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోలను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. 

సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా కూడా ఈ వాహనాల విడుదలపై ఆసక్తికర ట్వీట్ వేశారు. గ్రీన్(ఎలక్ట్రిక్) వాహనాలు ఇక హైదరాబాద్ రోడ్లపై బులుగు రంగులో కనిపిస్తాయని అన్నారు. 



Tags:    
Advertisement

Similar News