దరఖాస్తు పెడితే స్కీమ్‌ రాదు.. ఇంటింటి సర్వే తర్వాతే..

ప్రభుత్వం వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ.. ప్రస్తుతం జరుగుతున్న తీరు చూస్తే ఇప్పట్లో స్కీమ్‌ల అమలుపై అధికారుల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Update: 2024-01-09 09:07 GMT

కాంగ్రెస్‌ గ్యారంటీల అమలుపై రోజుకో ప్రకటనతో గందరగోళం నెలకొంది. ఇప్పటికే 5 గ్యారంటీల కోసం వ్యయ, ప్రయాసలకోర్చి ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకోగానే స్కీమ్‌లు రావని.. నిజమైన అర్హుల కోసం మరోసారి ఇంటింటి సర్వే నిర్వహిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ప్రభుత్వ సిబ్బంది దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని.. తర్వాతే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు పొంగులేటి. అర్హుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక పథకాలకు సంబంధించి గైడ్‌లైన్స్ విడుదలైన తర్వాత ఒక్కో స్కీమ్‌ కోసం మళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.



ప్రభుత్వం వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ.. ప్రస్తుతం జరుగుతున్న తీరు చూస్తే ఇప్పట్లో స్కీమ్‌ల అమలుపై అధికారుల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 17లోగా డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు అధికారులు.

Tags:    
Advertisement

Similar News