తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతంగా మారింది. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సాయంత్రం సమయాల్లో జంటనగరాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement
Update: 2024-02-25 04:55 GMT

తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల 2 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, వికారాబాద్‌, కామారెడ్డిలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు.

ఆవర్తనం కారణంగా హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతంగా మారింది. రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సాయంత్రం సమయాల్లో జంటనగరాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.

మరోవైపు ఏపీలోనూ రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది. అలాగే మరికొన్ని జిల్లాల్లో మంచు ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News