BRS ఏర్పాటును ఆహ్వానిస్తూ మహారాష్ట్రలో సంబురాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి అయితే తమ గ్రామం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్థానికులు అబిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు కేసీఆర్ పోస్టర్‌కు క్షీరాభిషేకం చేశారు. జై కేసీఆర్‌, అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అంటూ నినాదాలు చేశారు.

Advertisement
Update: 2022-12-15 02:52 GMT

మహారాష్ట్రలోని పలు గ్రామాల ప్రజలు భారత రాష్ట్ర సమితి కి స్వాగతం పలికారు . బుధవారం నాడు ఢిల్లీలో బీఆరెస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా మహారాష్ట్రలోని కిన్వాట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పటోడా గ్రామ ప్రజలు సంబురాలు చేసుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి అయితే తమ గ్రామం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్థానికులు అబిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను తాము చూస్తున్నామని చెప్పిన గ్రామస్తులు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు కేసీఆర్ పోస్టర్‌కు క్షీరాభిషేకం చేశారు. జై కేసీఆర్‌, అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అంటూ నినాదాలు చేశారు.

కేసీఆర్ నాయకత్వంలో తామంతా పని చేస్తామని పటోడా గ్రామ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ వినూత్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దేశాన్నే ఆకట్టుకుంటోందని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవ వల్ల తమ పక్కనే ఉన్న ఇచ్చోడ మండలంలోని ముఖ్రా (కె) గ్రామం ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని వారు గుర్తు చేశారు.

Tags:    
Advertisement

Similar News