భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిపై భూకబ్జా కేసు

సర్వే నంబర్ 501లో 200 గజాల ఫ్లాట్‌ కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు రాధిక. కంచర్ల రాధిక ఫిర్యాదుతో చామల కిరణ్‌ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఆదిభట్ల పోలీసులు.

Advertisement
Update: 2024-04-19 06:35 GMT

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై భూకబ్జా కేసు నమోదైంది. తుర్కయాంజల్ పరిధిలో కిరణ్‌ కుమార్ రెడ్డి భూమిని కబ్జా చేశారంటూ కంచర్ల రాధిక అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సర్వే నంబర్ 501లో 200 గజాల ఫ్లాట్‌ కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు రాధిక. కంచర్ల రాధిక ఫిర్యాదుతో చామల కిరణ్‌ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఆదిభట్ల పోలీసులు. సెక్షన్‌ 447, 427, 506 కింద కేసు నమోదు చేశారు.


రేవంత్‌కు అత్యంత సన్నిహితుడిగా చామల కిరణ్‌ కుమార్ రెడ్డికి పేరుంది. భువనగిరి ఎంపీ టికెట్‌ను తమ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఇప్పించుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ.. రేవంత్ సహకారంతో చివరకు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డికి అవకాశం దక్కింది.

Tags:    
Advertisement

Similar News