నిర్మలా సీతారామన్ గారూ..., ఒక సారి ఈ అంశాలనూ మాట్లాడండి ‍-కేటీఆర్ ట్వీట్

67 ఏళ్లలో 14 మంది భారత ప్రధానులు కలిసి 56 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే మోడీ 8 సంవత్సరాలలో ఆ అప్పును 100 లక్షల కోట్లకు పెంచారు అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అప్పుల గురించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

Advertisement
Update: 2022-09-04 12:16 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్ చెప్తున్న మాటలను తిప్పికొట్టారు.

ఆయన వరస ట్వీట్లలో....

''ఫైనాన్స్ మినిస్టర్ అప్పుల గురించి అనర్గళంగా మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు, 67 ఏళ్లలో 14 మంది భారత ప్రధానులు కలిసి 56 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. 2014 లో మోడీ ప్రధాని అయ్యాక ఇప్పటి వరకు 8 సంవత్సరాలలో ఆ అప్పును 100 లక్షల కోట్లకు పెంచారు.

ప్రస్తుతం ప్రతి భారతీయుడి తలపై1లక్షా25 వేల అప్పు ఉంది

2022లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు

జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1.49 లక్షలు

అప్పు: తెలంగాణ GSDP నిష్పత్తి 23.5 % (భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అత్యల్పంగా 23వ స్థానంలో ఉంది)

దేశ రుణం: GDP నిష్పత్తి 59%

భారత జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ భారతదేశ GDPకి 5.0% అందిస్తోంది (మూలం: RBI నివేదిక, అక్టోబర్ 2021)

దేశానికి కావలసింది పనికిరాని డబుల్ ఇంజన్లు కాదు "డబుల్ ఇంపాక్ట్" గవర్నెన్స్ కావాలి.

తెలంగాణ ప్రభుత్వం పని చేసినంత మెరుగ్గా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చేస్తే భారతదేశం ఇప్పుడు 4.6 ట్రిలియన్ డాలర్ల‌ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. '' అని కేటీఆర్ లెక్కలతో సహా నిర్మలా సీతారామన్ వాదనలను తిప్పికొట్టారు. 

Tags:    
Advertisement

Similar News