ఫేక్ న్యూస్ పెడ్లర్.. రేవంత్ పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత ఘాటుగా మారాయి.

Advertisement
Update: 2024-05-24 06:30 GMT

సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన ఓ ఫేక్ న్యూస్ పెడ్లర్ అని అన్నారు. తప్పుడు వార్తల్ని సర్కులేట్ చేస్తున్నారని, ఫేక్ న్యూస్ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తనపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు బదులిచ్చారు కేటీఆర్.


తన బంధువుకి పదివేల కోట్ల రూపాయల కొవిడ్ మందుల కాంట్రాక్ట్ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. అదే జోకర్, సెక్రటేరియట్ కింద నిజాం ఆభరణాలున్నాయని, వాటిని తవ్వి తాను తీసుకున్నానంటూ తప్పుడు కథనం సృష్టించి ప్రచారంలోకి తెచ్చారన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి సంబంధించి రిజర్వేషన్లపై ఫేక్ వీడియోని సృష్టించింది కూడా రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు కేటీఆర్. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా.. ఉస్మానియా యూనివర్శిటీ హాస్టల్ కి సంబంధించి ఓ నకిలీ సర్కులర్ పోస్ట్ చేశారని చెప్పారు. ఇలాంటి తప్పుడు వార్తలు సర్కులేట్ చేస్తున్న వ్యక్తిని జైలులో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు కేటీఆర్.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత ఘాటుగా మారాయి. తప్పుడు వార్తల్ని పోస్ట్ చేయడం, తప్పుడు కథనాలతో ఆరోపణలు చేయడం నిత్యకృత్యంగా మారింది. అనుకూల మీడియా ద్వారా ఈ ఆరోపణలు తీవ్రతరం చేస్తున్నారు నేతలు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి తప్పుడు వార్తల్ని ప్రచారంలోకి తేవడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News