ఇది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన - కేటీఆర్

స్థానికంగా ఉండే పోలీసులపై నమ్మకం లేదన్నారు కేటీఆర్. శ్రీధర్ రెడ్డి హత్యపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Update: 2024-05-23 14:15 GMT

రేవంత్ సర్కార్ చేస్తోంది ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలన అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలపని వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటోందన్నారు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో హత్యకు గురైన బీఆర్ఎస్ లీడర్ శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని కేటీఆర్‌ పరామర్శించారు. అంతకుముందు చిన్నంబావి నుంచి లక్ష్మీపల్లి వరకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, RS ప్రవీణ్‌కుమార్‌, బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో కలిసి ర్యాలీగా వెళ్లారు కేటీఆర్.


శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమేయం లేకుండా 4 నెలల వ్యవధిలో రెండు హత్యలు జరగవన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

స్థానికంగా ఉండే పోలీసులపై నమ్మకం లేదన్నారు కేటీఆర్. శ్రీధర్ రెడ్డి హత్యపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వరుస హత్యల నిగ్గు తేల్చేందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య వెనుక మంత్రి జూపల్లి హస్తం లేకపోతే నిష్పక్షపాత విచారణకు సహకరించాలన్నారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News