నేడు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్.. రేసులో వీళ్లే.!

చేవెళ్ల, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులపై మాత్రమే క్లారిటీ వచ్చింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని గతంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.

Advertisement
Update: 2024-03-03 05:39 GMT

గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌కు రానున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అందుకు ఆయన కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్‌ తరపున పోటీ చేయబోయే కొంతమంది అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటిస్తారని తెలుస్తోంది. చాలా స్థానాల్లో సిట్టింగ్‌లకు అవకాశాలు ఇవ్వరనే ప్రచారం జరిగింది.

ఇప్పటివరకూ చేవెళ్ల, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులపై మాత్రమే క్లారిటీ వచ్చింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని గతంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఇక నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి లేదా తేరా చిన్నపరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణా రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, దూదిమెట్ల బాలరాజు లాంటి వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి.

గులాబీ బాస్ సొంత జిల్లా మెదక్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎవరిని బరిలో దింపుతారనేది కూడా సస్పెన్స్‌గా మారింది. మరోవైపు ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్ నేత, బీబీ పాటిల్, రాములు ఇటీవల పార్టీని వీడారు. దీంతో పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్‌కర్నూలు స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించాల్సిన పరిస్థితి. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, వరంగల్‌, ఆదిలాబాద్‌ నుంచి ఎవరిని దింపుతారనేది ఆసక్తిగా మారింది.

Tags:    
Advertisement

Similar News