నేడు అసెంబ్లీకి కేసీఆర్..! తొలి ప్రసంగంపై అందరిలో ఆసక్తి

రెండు రోజుల క్రితం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాల తీర్మానంపై చర్చకు సమయం సరిపోయింది. ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈరోజు నుంచి అసలైన చర్చ మొదలవుతుంది.

Advertisement
Update: 2024-02-10 01:52 GMT

ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. అనారోగ్యం కారణంగా అసెంబ్లీ తొలి సమావేశాలకు ఆయన హాజరు కాలేకపోయారు, అందుకే ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఆలస్యమైంది. ఈనెల 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్.. ఈరోజు అసెంబ్లీకి హాజరవుతారని తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాల తీర్మానంపై చర్చకు సమయం సరిపోయింది. ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈరోజు నుంచి అసలైన చర్చ మొదలవుతుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి హాజరవుతారని అంటున్నారు. ఆయన అసెంబ్లీకి వస్తారని తేలడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

అసెంబ్లీలో మాటల యుద్ధం..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి సమావేశాలనుంచే అసెంబ్లీలో మాటల యుద్ధం మొదలైంది. బడ్జెట్ సమావేశాల్లోనూ అది కొనసాగుతోంది. ప్రతిపక్ష నిరసనలతో అసెంబ్లీ ఘట్టం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు కేసీఆర్ ఎంట్రీతో అది మరింత ఆసక్తిగా మారుతుంది. ఇప్పటికే కృష్ణా ప్రాజెక్ట్ ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రానికి సాగిలపడిందని విమర్శించారు కేసీఆర్. అసెంబ్లీలో కూడా అదే అంశాన్ని ఆయన ప్రస్తావించే అవకాశముంది. ఇక బడ్జెట్ పై కూడా ఆయన మార్కు కామెంట్లు ఉంటాయి. కేసీఆర్ లేని అసెంబ్లీ చప్పగా సాగిందని, ఇప్పుడు అసలైన మజా వస్తుందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ తొలిరోజునుంచీ దూకుడు ప్రదర్శిస్తారా లేక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారా అనేది వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC