ఒక్కటి పోతే పది తెస్తాం.. కంపెనీలు వెళ్లిపోవడంపై శ్రీధర్ బాబు

ఏదైనా పరిశ్రమ తెలంగాణను విడిచివెళ్తుందంటే అది కేంద్ర ప్రభుత్వ తీరు వల్లేనని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్క కంపెనీ పోతే పది కంపెనీలు తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisement
Update: 2024-05-27 03:19 GMT

తెలంగాణ నుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఇటీవల దావోస్ పర్యటనలో 40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. వాటితో సంబంధం లేకుండా మరో 9 వేల కోట్ల ఒప్పందాలు పురోగతిలో ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఇక కేటీఆర్ ఆరోపించినట్లు కీన్స్ టెక్నాలజీ తెలంగాణ నుంచి వెళ్లిపోలేదన్నారు శ్రీధర్ బాబు. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాల కోసం ఆ సంస్థ వేచి చూస్తుందన్నారు. ఇక కార్నింగ్ సంస్థ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని.. కానీ కేటీఆర్ మాత్రం ఒప్పందం జరిగిందనట్లుగా ప్రకటన చేశారని ఆరోపించారు శ్రీధర్ బాబు.

దావోస్‌ తరహాలోనే పది రెట్లు పెట్టుబడులు తెస్తామన్నారు శ్రీధర్ బాబు. అయితే ఏదైనా పరిశ్రమ తెలంగాణను విడిచివెళ్తుందంటే అది కేంద్ర ప్రభుత్వ తీరు వల్లేనని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్క కంపెనీ పోతే పది కంపెనీలు తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక 2016 నుంచి పరిశ్రమలకు ఇవ్వాల్సిన సబ్సిడీ రూ. 3007 కోట్లు పెండింగ్‌లో ఉందన్నారు శ్రీధర్ బాబు.

Tags:    
Advertisement

Similar News