తెలంగాణకు ఇతర రాష్ట్రాలనుంచి ఐఏఎస్ లు, ఐపీఎస్ లు..

శాంతి భద్రతల విషయంలో తెలంగాణ పోలీస్ అధికారులతో కలసి 39 మంది ఇతర రాష్ట్రాల ఐపీఎస్ లు కూడా విధులు నిర్వహిస్తారు. వీరికి సంబంధించిన వివరాలు ఇప్పటికే రాష్ట్ర అధికారులకు అందజేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

Advertisement
Update: 2023-11-02 09:19 GMT

తెలంగాణకు ఇతర రాష్ట్రాలనుంచి ఐఏఎస్ లు, ఐపీఎస్ లు..

తెలంగాణ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మొదటినుంచీ పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను ఎన్నికలకు దూరం పెట్టింది. వారి స్థానంలో ఇతరులకు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఎన్నికల పరిశీలకులుగా ఇతర రాష్ట్రాల అధికారులను తెలంగాణకు పంపిస్తోంది. వీరంతా నామినేషన్ల స్వీకరణ పూర్తయిన తర్వాత ఇక్కడ విధుల్లో చేరతారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకే ఇతర రాష్ట్రాల అధికారులను ఇక్కడికి పంపిస్తున్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి.

106మంది ఉన్నతాధికారులు.

తెలంగాణ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా 67 మంది ఐఏఎస్‌ అధికారులు, 39 మంది ఐపీఎస్‌ అధికారులను పరిశీలకులుగా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. వీరంతా ఈ నెల 10 నుంచి విధుల్లో చేరతారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తారు. రాష్ట్ర అధికారుల సమన్వయంతో పనిచేస్తారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ పోలీస్ అధికారులతో కలసి 39 మంది ఇతర రాష్ట్రాల ఐపీఎస్ లు కూడా విధులు నిర్వహిస్తారు. వీరికి సంబంధించిన వివరాలు ఇప్పటికే రాష్ట్ర అధికారులకు అందజేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

రేపటి నుంచి నామినేషన్లు..

తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాలకు రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 5న ఆదివారం సెలవు కావడంతో ఆ ఒక్కరోజు నామినేషన్లు స్వీకరించరు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 10 తుది గడువు. 13వ తేదీన అభ్యర్థుల నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. 15వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అదేరోజు తుదిజాబితా ప్రకటిస్తారు. ఎన్నికల బరిలో నిలబడుతున్నదెవరో తేలిపోతుంది. ఇక ఈ నెల 30న తెలంగాణ ఎన్నికలు సింగిల్ ఫేజ్ లో జరుగుతాయి. 

Tags:    
Advertisement

Similar News