నేను సీఎం అవుతా.. రేసులోకి జానారెడ్డి

జానారెడ్డి సీఎం కావాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. తనకు తానుగా ఏ పదవీ కోరుకోవట్లేదని చెప్పారు. సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో అన్నారు.

Advertisement
Update: 2023-10-18 05:51 GMT

కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పదవుల రేసులో తాను లేనని..పదవులే రేసులో ఉండి తనని అందుకుంటాయన్నారు. పీవీ నరసింహరావు ప్రధానమంత్రి ఎలా అయ్యారో తను కూడా అలానే సీఎం అవొచ్చన్నారు జానారెడ్డి. ఆరు నెలల్లో తన కొడుకు రాజీనామా చేస్తాడని, తర్వాత తాను పోటీ చేసి గెలుస్తానన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

జానారెడ్డి సీఎం కావాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. తనకు తానుగా ఏ పదవీ కోరుకోవట్లేదని చెప్పారు. సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో అన్నారు. ఏ పదవి వచ్చిన కాదనని, ఏ సీఎం చేయనన్ని శాఖలు నిర్వర్తించానని చెప్పుకొచ్చారు. 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చి..36 ఏళ్లకే మంత్రిని అయ్యానన్నారు. 55 రాజకీయ అనుభవం ఉందన్న జానారెడ్డి..తనకు పదవులు వాటంతట అవే వస్తాయన్నారు.

ఈ సారి అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న జానారెడ్డి తన కొడుకును బరిలో దించారు. నాగార్జున సాగర్ టికెట్‌ను ప్ర‌స్తుతం జానారెడ్డి కొడుకు జైవీర్‌ రెడ్డికి ఇచ్చింది కాంగ్రెస్ అధిష్ఠానం.

Tags:    
Advertisement

Similar News